మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని రాజేష విజయన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. కాకపోతే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ లో గుర్తింపు దక్కింది. 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ కార్తీ హీరో గా రూపొందినటువంటి తమిళ సినిమా సర్దార్ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి తమిళ్ ... తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు సర్దార్ మూవీ ద్వారా సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తాజాగా పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... గ్రే కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: