సాధారణంగా సౌత్ హీరోల సినిమాలు నార్త్ కు వెళ్తూ ఉంటాయి. గత కొన్ని ఏళ్లు గా సౌత్ సినిమాలు నార్త్ కు వెళుతున్నాయి. కానీ కరోనా పరిస్థితిల వల్ల ఈ సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు సినిమాలతో పాటు కథలు కూడా తీసుకెళ్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు దక్షిణాది హీరోలు కూడా బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు చేయడానికి ఆసక్తి చెబుతున్నారు. ఈ దిశగా ప్రభాస్ నుండి తొలి అడుగులు పడ్డాయి. ఇక ఆ తర్వాత చాలామంది హీరోలు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ నుండి సూర్య కూడా వెళ్ళనున్నారని తెలుస్తోంది.

 సూర్య బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా ఫిక్స్ అయిందని అంటున్నారు. ఇప్పటికే ధనుష్ అక్కడ కొన్ని సినిమాలు చేసి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సూర్య కూడా అదే పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఒక దర్శకుడుని కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టైటిల్ కూడా విడుదల చేశారు చరిత్ర బృందం. కాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ కి

మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. అదే జోరులో ఈ ఏడాది చివర బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడట సూర్య. ప్రముఖ హిందీ దర్శక నిర్మాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రతో ఒక భారీ పౌరాణిక సినిమా కోసం చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రెండు భాగాలుగా రాబోయే ఈ సినిమా కోసం కర్ణ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట దర్శక నిర్మాతలు. మహాభారతంలోనే కర్ణ పాత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. నిజానికి సూర్య రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కర్ణ సినిమా గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. తాజాగా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓకే అయింది అన్న వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: