తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే రవితేజ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం రవితేజ ఏకంగా ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా అనే మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు. ఇందులో ధమాకా మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించగా ... ఖిలాడి మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక రామారావు ఆన్ డ్యూటీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం రవితేజ రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ... ఈగల్ అనే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఈ సంవత్సరం దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించగా ... ఈగల్ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ రెండు మూవీ లు సెట్స్ పై ఉండగానే రవితేజ తన తదుపరి మూవీ ని ఓకే చేసినట్లు తెలుస్తోంది.

ఇది వరకు రవితేజ కు డాన్ శీను ... బలుపు ... క్రాక్ మూవీ లతో అద్భుతమైన విజయాలను అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది వరకే రవితేజ ... శ్రీ లీల కాంబినేషన్ లో రూపొందిన ధమాకా మూవీ అద్భుతమైన విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: