వాస్తవానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మూవీ టీజర్ గురించి ఎదురు చూస్తుంటే ఈ మూవీ నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ అధినేతలు ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న లుంగీ డాన్స్ లకు సంబంధించిన ఫోటోను వదిలి పవన్ అభిమానులకు జోష్ ను కలిగించారు. పవన్ కెరియర్ తొలి రోజులలో నటించిన ‘తమ్ముడు’ సినిమాలోని వయ్యారి భామ పాటలోని లుంగీ గెటప్ ను రిపీట్ చేస్తూ ఊర మాస లుక్ లో పవన్ కనిపిస్తున్న ఈఫోటో వైరల్ గా మారింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్ ను ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారో అదేవిధంగా ఈ మూవీ టీజర్ ను ఎప్పుడు విడుదల చేస్తారు అన్న విషయమై ఈ మూవీ నిర్మాతలు పీపుల్ మీడియా సంస్థ మౌనం వహిస్తూ ఉండటం పవన్ అభిమానులకు షాకింగ్ గా మారింది. ఈ మూవీ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్లకు అమ్మకం జరిగింది అని వస్తున్న వార్తలు షాకింగ్ గా మారాయి.
ఇప్పటికే వారాహి యాత్ర సూపర్ సక్సస్ అవ్వడంతో జోష్ లో ఉన్న పవన్ అభిమానులు ఈమూవీలో దేవుడు గా కనిపించబోతున్న పవన్ నోటివెంట వచ్చే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కు అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంచనాలకు అనుగుణంగా ఈ మూవీ కలక్షన్స్ విషయంలో సూపర్ హిట్ అయితే రాజకీయంగా సినిమాల పరంగా పవన్ సూపర్ సక్సస్ ట్రాక్ లో ఉన్నాడు అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి