తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన డాన్స్ కొరియోగ్రాఫర్ లలో ఒకరు అయినటువంటి జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జానీ మాస్టర్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన రచ్చ మూవీ ద్వారా డాన్స్ మాస్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ డాన్స్ మాస్టర్ కు తెలుగు సినిమాల్లో వరసగా అవకాశాలు దక్కాయి. అలాగే జానీ మాస్టర్ కు తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల నుండి కూడా అవకాశాలు దక్కాయి. 

దానితో ఈ డాన్స్ మాస్టర్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న కొరియోగ్రాఫర్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆ మూవీ మేకర్స్ విడుదల చేశారు. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ "రన్నర్" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి విజయ్ చౌదరి దర్శకత్వం వహిస్తూ ఉండగా ...  విజయ డమరుక ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టైటిల్ మరియు ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో జానీ మాస్టర్ అదిరిపోయే స్టైలిష్ లుక్  లో ఉన్న డ్రెస్ ను వేసుకొని పరిగెడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: