విడాకులకు సంబంధించి ప్రచారం లోకి వచ్చిన వార్తల వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని రాజీవ్ కనకాల అన్నారు. తమ విడాకుల గురించి ప్రచారం జరగడం కొత్త కాదని ఈ ప్రచారం చాలా రోజుల నుంచి సాగుతోందని ఆయన అన్నారు. మేము విడాకులు తీసుకోవడం లేదని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసినా ఆ వార్తలను నమ్మడం లేదని రాజీవ్ కనకాల తెలిపారు. అమ్మానాన్న జీవించి ఉంటే ఇలాంటి ఫేక్ వార్తలు వాళ్లను సైతం బాధ పెట్టేవని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
విడాకులకు సంబంధించి వార్తలు ప్రచారం లోకి వస్తే ఆ వార్తలకు సుమ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదని రాజీవ్ కనకాల వెల్లడించారు. తనను మాత్రం అలాంటి వార్తలు హర్ట్ చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. విడాకుల గురించి స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా అదే తరహా వార్తలను ప్రచారం చేయడం కరెక్ట్ కాదని రాజీవ్ కనకాల కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాజీవ్ కనకాల నుంచి పూర్తిస్థాయి లో క్లారిటీ వచ్చిన నేపథ్యం లో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి వల్ల రాజీవ్ కనకాల కెరీర్ కు మేలు జరిగింది. సుమ, రాజీవ్ కెరీర్ పరంగా మరింత బిజీ కావడం తో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి