శ్రీదేవి ఎప్పటికి ఇక అందుకోలేని అందం. ఒక్కసారైనా మళ్లి కనిపిస్తే బాగుండు అనిపిస్తున్న అది జరగదు అని తెలిసిన పిచ్చి పేరాశ ఊరుకోదు కదా.ఆమె ఎప్పటికి మూడు దశాబ్దాల యువతకు డ్రీమ్ గర్ల్. శ్రీదేవి తో ఒక్కసారైనా నటించాలని అనుకోని హీరో అప్పట్లో లేరు. అందుకే తండ్రి కొడుకులకు హీరోయిన్ గా మారిన ఘటన కేవలం ఆమెకు మాత్రమే దక్కింది. శ్రీదేవి అతి సుకుమార కోమలాంగి.ఆమె వివాహం చేసుకొని ఎక్కడ సినిమాలు మానేస్తుందో కొన్నేళ్లు యువత బాధ పడేవారట. ఇక బోనీ తో కమిట్ అయినా తర్వాత చాల మంది పీకల్లోతు నిరాశ లో కూరుకు పోయారు. అందుకే శ్రీదేవి కోసం పడిచచ్చిపోయే ఎంతో మంది ఉన్నారు.అయితే శ్రీదేవి మాత్రం తన కెరీర్ బాగా ఉన్నప్పుడు రెండో పెళ్లి వాడిని చేసుకోకూడని అనుకునేదట. అందుకు గల ముఖ్య కారణం ఆమె తల్లి రాజేశ్వరి.

ఆమెకు సమాజంలో దొరకని గౌరవం. తన తండ్రి అయ్యప్ప శర్మకు తల్లి రాజేశ్వరి సమాజం ఒప్పుకొని భార్య కాబట్టి పెళ్లి విషయం లో ఆమె ఇలాంటి ఒక రూల్ పెట్టుకుంది. సినిమాల్లో నటిస్తున్న క్రమం లో చాల మంది హీరోలను ఈ ఒక్క కారణం తోనే శ్రీదేవి రిజెక్ట్ చేసిందట. పెళ్లి విషయంలో ఆమె రిజెక్ట్ చేసిన వారి విషయానికి వస్తే ఎస్ టెన్నిస్ ప్లేయర్ అయినా విజయ్ అమ్రిత్ రాజ్ తో ఒకసారి ఎంగేజ్మెంట్ జరిగింది కానీ అదే సమయంలో ఆమె బోనీ తో కూడా రిలేషన్ మైంటైన్ చేసి గర్భవతి కావడం తో ఆ ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చేసి పెళ్లి చేసుకుంది.

అంతకంటే ముందు జితేంద్ర తో ఆమెకు ఏందో బంధం ఉంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి . ఇక మిథున్ చక్రబర్తి తో ఆమె ప్రేమ, వివహం కూడా అందరికి తెలిసిందే. కానీ మిథున్ అతడి మొదటి భార్యకు విడాకులు ఇచ్చేనందుకు నో చెప్పడం వీరి బంధం ముగిసిపోయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు శ్రీదేవి తల్లి రాజేశ్వరి తన కూతురికి ఎక్కడ పెళ్లి కాకుండా మిగిలిపోతుందో అని ఇంటికే వచ్చిన ప్రతి ఒక్కరిని మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని అడిగేవారట. ఆలా అడిగిన వారిలో జె డి చక్రవర్తి, హీరో రాజశేఖర్ వంటి వారు ఉన్నారు. ఇక శ్రీదేవి పై వర్మ అప్పటికి, ఇప్పటికి పిచ్చి ప్రేమతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: