సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బీస్ట్ మూవీ తో ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...  ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ... రజిని సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... సన్ పిక్చర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తీ కాగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి "కావాలయ్యా" "హుకుం" అంటూ సాగే రెండు పాటలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. 

ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. కాకపోతే ఈ రెండు పాటలకు సంబంధించిన తమిళ్ వెర్షన్ లను మాత్రమే ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ లోని మొదటి పాట అయినటువంటి "కావాలయ్యా" అంటూ సాగే పాటకు సంబంధించిన తెలుగు వర్షన్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. కావాలయ్యా సాంగ్ తెలుగు వర్షన్ సాంగ్ కు సంబంధించిన ఈవెంట్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మూవీ మేకర్స్ "సీఎంఆర్" కాలేజ్ హైదరాబాద్ లో నిర్వహించబోతోంది. ఇందులోనే ఈ సాంగును కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ తెలుగు వర్షన్ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: