ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బిచ్చగాడు మూవీ తో తెలుగు లో మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి వరుసగా ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఇప్పటికే ఈయన రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒకటి బిచ్చగాడు ... రెండవది హత్య. బిచ్చగాడు 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని అందుకోగా హత్య సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ మంచి విజయాన్ని అందుకో లేక పోయింది. ఇకపోతే బిచ్చగాడు మూవీ కి ఈయనే స్వీయ దర్శకత్వం వహించాడు. 

ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు రోమియో అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే వినాయక్ వైద్యనాథన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ  పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ తో విజయ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: