మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారికి కూడా నటుడు మమ్ముట్టి సుపరిచితమే.. తెలుగులో కూడా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించి మెప్పించారు. మలయాళం లో ఈయనను మెగాస్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఇక పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలలో ఈయన కూడా ఒకరు. ఈ ఏడాది టాలీవుడ్ లో ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు మమ్ముట్టి.. మలయాళం లో మాత్రం ఎన్నో సంవత్సరాలుగా తన నటనకు ప్రాధాన్యత ఉంటే పాత్రలోనే న్యాచురల్ కథలతోనే సినిమాలను చేస్తూ మంచి పేరు సంపాదించారు.


ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఒక హర్రర్ త్రిల్లర్ చిత్రానికి శ్రీకారం చుట్టడం జరిగింది.. మమ్ముట్టి నటించబోతున్న ఒక కొత్త సినిమా చాలా గ్రాండ్ గా ప్రారంభమయ్యింది.. భ్రమయుగం అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది.రిలీజ్ చేసిన ఒక పోస్టర్ అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.. ఇందులో ఒక పెద్ద ఇల్లు దాని ముందు ఒక వ్యక్తి చేతిలో కాగడ పట్టుకొని నిలుస్తూ ఉన్నట్లుగా ఈ పోస్టర్లు చూపించడం జరిగింది. అయితే ఇంటి వెనకాల కొండలు ఆ పైనే భూతాల లాంటి వ్యక్తులు కనిపించడంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంటోంది..
ఈ చిత్రాన్ని రాహుల్ సిసింద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోక్ ,సిద్ధార్థ భరత్, తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.. ఇకపోతే మమ్ముట్టి ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నారు వాటిలో గ్రీన్ థ్రిల్లర్గా తెరకేకిస్తున్న బజూక కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్  డినో డేన్నిస్  దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ చిత్రం పైన మంచి బస్ ఏర్పడుతోంది ఇందులో గౌతమ్ మీనన్, సిద్ధార్థ భరతన్, టౌమ్ చైన్ చాకో  తదితరుల సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: