తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటుడు సుహాస్ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలను దక్కించుకుంటూ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు . ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించాడు .

 ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడం అలాగే ఈ మూవీ లో ఇతను తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈ నటుడికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల జోరు మరింతగా పెరిగింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో విలన్ పాత్రలో కూడా నటించాడు . ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .  

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ రోజు సుహాస్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఒక పోస్టర్  ని విడుదల చేస్తూ ఈ మూవీ టీజర్ ను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో సుహాస్ లుంగీ పంచ కట్టుకొని ... బనీన్ వేసుకొని ... మెడలో ఒక కండువా ను వేసుకొని ఒక స్టైలిష్ డ్యాన్స్ స్టెప్ ని వేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: