అక్కినేని నాగచైతన్య తదుపరి చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తను నటించిన గత చిత్రం కష్టడి. ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. ఇప్పుడు యువ దర్శకుడు చందు మండేటి దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నారు.. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటించబోతోంది అంటూ రీసెంట్గా అధికారికంగా ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. అల్లు అర్జున్ సమర్పణలో GA -2 లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లేవల్ లోనే ఈ సినిమాని నిర్మించే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.


2018లో గుజరాత్ సముద్రతీరంలో వేటకు వెళ్లి 21 మంది మృతి కారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు దొరికిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే వారి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాని తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. చైతు ఈ సినిమాలో మాస్ హీరోగా కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఒక జాలరి పాత్రలో కూడా కనిపించబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


మొదట ఈ సినిమాకు 60 కోట్లు అనుకోగా.. కథ చాలా పెద్దది కావడంతో 80 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఖర్చుకు మాత్రం ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించాలని నిర్మాత బన్నీ వాసు అనుకుంటున్నట్లు సమాచారం.  ఈ సినిమా కంటెంట్ కూడా నేషనల్ ఆడియోస్ని కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలిపి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కార్తికేయ సినిమాతో చందు మొండేటి మంచి పాపులారిటీ సంపాదించారు.. చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ ముందుగా నాగచైతన్యతో సినిమా కమిట్ అయినందుకు ఈ చిత్రాన్ని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: