తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభం:
మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిర్మించారు. ఈ సినిమా కోసం రూ .60 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత రూ.200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి ఉంటారనేలా కనిపించింది. కార్తీక్ ఘట్టమనేని సినిమా విజువల్స్ ను చాలా బలంగానే ప్రజెంట్ చేశారు. కెమెరా షాట్స్, యాక్షన్ బ్లాక్, VFX అన్నీ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి హైలైట్ గా తేజ సజ్జా, మంచు మనోజ్ మధ్య జరిగే సీన్స్ ఉంటాయి. పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్ గా ఈ సినిమా సక్సెస్ అయ్యింది. మిరాయ్ చిత్రంలో రాముడు సీన్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పక్షి లాగా వచ్చే సీన్ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.147 నుంచి 150 కోట్ల వరకు రాబట్టింది. ఇండియాలో ఒక్కటే రూ. 98 నుంచి రూ .108 కోట్లు రాబట్టింది . అలాగే ఓటీటి హక్కులు కూడా భారీ ధరకే అమ్ముడుపోయాయి.
నటీనటుల రెమ్యూనరేషన్:
హనుమాన్ సినిమా సమయంలోనే మాట ఇవ్వడంతో తేజ సజ్జా రెమ్యూనరేషన్ ఈ సినిమాకి రూ. 2 కోట్లు తీసుకున్నారట. అలాగే శ్రియ రూ. 2 కోట్లు, హీరోయిన్గా నటించిన రితిక నాయర్ రూ. 50 లక్షలు, మంచు మనోజ్ రూ. 3 నుంచి 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
మిరాయ్ సినిమా తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. తక్కువ బడ్జెట్ తో కూడా సినిమాలు తీయచ్చని నిరూపించారు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి