నటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇకపోతే ఈయన పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అమిగోస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలలో నటించాడు. ఈ మూవీ లో తన నటనతో కళ్యాణ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు డెవిల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో కమెడియన్ సత్య ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం నవంబర్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా నుండి మొదటి పాటను కూడా విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు రెండు కోట్ల ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ యొక్క ఓవర్ సిస్ హక్కులను ఓ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: