ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం మంత్రి రోజా గురించి సినీ ప్రేక్షకులకు తెలుగు జనాలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోయిన్గా  చక్రం తిప్పింది రోజా. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా జోడి కట్టి ఆడి పాడింది అన్న విషయం తెలిసిందే. తన నటనతో తన అందం అభినయంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ అయ్యింది అన్న విషయం తెలిసిందే.


 అయితే రోజా ఇలా హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన సెల్వమనిని పెళ్లి చేసుకుంది. ఇక వీరిద్దరూ కూడా అన్యోన్య దంపతులుగానే కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రిగా కొనసాగుతుంది రోజా. అంతేకాదు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇక ఇటీవల కాలంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. రోజా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు రాజకీయాలకి చెందినవారు కూడా రోజుకు ఇక మద్దతుగా ఉంటూ బండారు సత్యనారాయణకు కౌంటర్ ఇస్తున్నారు.


 అయితే ప్రస్తుతం రోజా కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే రోజా లవ్ స్టోరీ ఏకంగా సినిమా రేంజ్ లో ట్విస్టులు ఉంటాయి అని వార్త వైరల్ గా మారింది. దర్శకుడు సెల్వమని రోజాని చాలా కాలం పాటు ఇష్టపడ్డారట. అలా ఆమెతో సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమెను చూడటం చేసేవాడట. సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో డైరెక్ట్ గా రోజా దగ్గరికి వెళ్లి ఐ లవ్ యు చెప్పాడట సెల్వమని. నీతో పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అంటూ డైరెక్ట్ గా చెప్పేసాడట  అప్పుడు రోజా షాక్ అయ్యి ఆలోచనలో పడిపోయిందట. 1992లో సెల్వమని ప్రపోజ్ చేశాక.. ఆయన ప్రేమను యాక్సెప్ట్ చేసిన రోజు 2002లో చివరికి పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: