టాలీవుడ్ మరియు కోలీవుడ్ రెండు చిత్ర పరిశ్రమల్లో అందాల తారా గా పేరున్న నటి త్రిష గూర్చి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.త్రిష ఒకప్పుడు అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తర్వాత తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరం అయింది. మరలా రెండు ఇండస్ట్రీల్లో కూడా రీ ఎంట్రీ ఇస్తూ కుర్ర హీరోయిన్స్ లతో పోటీగా దూసుకుపోతుంది. .ఫార్టీ ప్లస్ ఏజ్ లో కూడా త్రిష తన లుక్స్ తో ఆడియన్స్ ని అవాక్కయ్యేలా చేస్తుంది. తెలుగులో పూర్తిగా సినిమాలు ఆపేసిన త్రిష తమిళంలో వరుసగా చేస్తూ వస్తుంది.96 సినిమాతో అమ్మడు అక్కడ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అప్పటి నుంచి త్రిష వరుసగా సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా దళపతి విజయ్ తో లియో సినిమా చేసింది త్రిష. ఈ సినిమాలో త్రిష పాత్ర కొద్దిసేపే అయినా ఆమె లుక్స్ మాత్రం అదరగొట్టాయి.

త్రిష అందానికి కారణం ఏంటో కానీ అమ్మడు స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇదే ఊపుతో త్రిష కు మరోసారి టాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరో గా బాబీ  డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. టాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్న త్రిష ఈసారి బాలకృష్ణ సినిమాకు ఓకే చెప్పిందని టాక్. ఇంతకుముందు త్రిష చిరు సినిమాలు రెండిటిని కాదన్నది. అయితే ఈ టైం లో ఏ ఆఫర్ వచ్చినా చేయాల్సిందే అని బాలయ్య సినిమాకు ఓకే చెప్పింది. బాలకృష్ణ సినిమాలో త్రిష హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: