మాస్ మహారాజా రవితేజ మరికొన్ని రోజుల్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ని మైత్రి సంస్థ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నాడు. సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకి మాటలను అందించనుండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి సెల్వ రగవన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన ... రవితేజ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించే ముద్దుగుమ్మకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా ఈ సినిమా బృందం వారు మొదట ఈ మూవీ లో హీరోయిన్ గా రష్మిక ను సంప్రదించగా ఈ ముద్దుగుమ్మ కూడా ఇందులో నటించడానికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కానీ ఆ తర్వాత ఈ నటికి వరస సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి తేదీలను అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి శెట్టి ని ఫైనల్ చేసుకున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: