సత్యభామ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటిస్తోంది.క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా "సత్యభామ" టీజర్ రీసెంట్ గా విడుదల చేశారు.టీజర్ ఎంతో ఆసక్తి కలిగిస్తుంది..హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంటుంది. పై అధికారులు సత్య..ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే..కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య.అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంటుంది.టీజర్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి