ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో మరొకసారి తనలో ఉన్న మాస్ యాక్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. కాగా ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా నటిస్తోంది. 

ఇప్పటికే వాటికి సంబంధించిన పోస్టర్లు టైటిల్ సినిమాపై అంచనాలను భారీ స్థాయికి పెంచేసాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్  టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన హిందీలో నటిస్తున్న మొదటి సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ సైతం మెయిన్ రోల్ పోషిస్తున్నారు. గతంలో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ కలిసి నటించిన సూపర్ హిట్ యాక్షన్ వార్ కు ఇది సీక్వెల్. వార్ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్ తీసుకువస్తున్నారు.

ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర మూవీ ఫేమ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో ఎప్పటిలాగే కబీర్ పాత్రలో కనిపించనున్నారు హృతిక్. కానీ తారక్ మాత్రం ఇందులో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే ఇందులో హీరోయిన్ ఎవరు అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికీ దీని కోసం చాలామంది హీరోయిన్స్ ని సంప్రదించారట. గతంలో దీపిక పదుకొనే హీరోయిన్గా ఫిక్స్ అయింది అన్న వార్తలు కూడా వచ్చింది. కానీ వాటిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా కనిపించబోతోంది అన్న సమాచారం వినబడుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: