ప్రస్థుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్న మూవీ ‘యానిమల్’ ఈమధ్య కాలంలో ఏసినిమాకు రానంత హైక్ ఈసినిమాకు రావడం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇప్పటివరకు దర్శకుడు సందీప్ వంగా తీసిన రెండు సినిమాలు మాత్రమే అయినప్పటికీ ఏదర్శకుడుకీ రానంత హైక్ ఈ మూవీ దర్శకుడుకి వచ్చింది.తెలుగు రాష్ట్రాలలో కూడ ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ మ్యానియాతో తెలుగు రాష్ట్రాలలోని యూత్ ప్రస్తుతం ఎక్కడ చూసినా దర్శకుడు సందీప్ వంగా గురించి సంబంధించిన వార్తలను తెగ సర్చ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ దర్శకుడు గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.సందీప్ వంగా సంచలన దర్శకుడు మాత్రమే కాకుండా అతడు నటుడు అన్న విషయం ఇప్పుడు లేటెస్ట్ గా చాలామందికి తెలిసిపోయింది. ఇతడు దర్శకుడుగా మారనప్పుడు చాల సంవత్సరాల క్రితం నాగార్జున నటించిన ‘కేడి’ సినిమాకు దర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేశాడు అని తెలుస్తోంది. అప్పట్లో కిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈమూవీ ఆరోజులలో ఘోరమైన ఫ్లాప్ గా మారింది.అయితే ఈసినిమాలో వచ్చే ఒక చిన్న సీన్ లో సందీప్ వంగా నటుడుగా కనిపించిన విషయం ఇప్పుడు బయట పడింది. ఈ మూవీలో నేవీ పోలీసులు స్మగలర్స్ ఉన్న ఒక బోటు పై దాడి చేసిన సీన్ లో సందీప్ వంగా కూడ ఆ సీన్ లో కనిపించిన సందర్భానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో రానున్న రోజులలో సందీప్ వంగా దర్శకులు దాసరి విశ్వనాద్ ల మాంచి నటుడుగా మారిన ఆశ్చర్యం లేడు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు ఏర్పడిన మ్యానియా టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇవ్వడంతో ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ పై అనేక అంచనాలు ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: