తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ... ఎస్ జె సూర్యమూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా మార్క్ ఆంటోనీ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విశాల్ తన కెరియర్ లో 34 వ మూవీ ని మరికొన్ని రోజుల్లో ప్రారంభించబోతున్నాడు. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

విశాల్ కెరియర్ లో 34 మూవీ కి సంబంధించిన టైటిల్ రిలీజింగ్ ను మరియు ఫస్ట్ షాట్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.  విశాల్ ... హరి కాంబో లో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: