ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఇద్దరు బద్ధ శత్రువులుగా పేరున్న స్టార్‌లను ఒకే సినిమాలో కలపబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు — టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార.ఇప్పటికే లోకేష్ కనకరాజ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతోందన్న విషయం అధికారికంగా ప్రకటించబడింది. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేశారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. కారణం — అల్లు అర్జున్, నయనతార మధ్య గతంలో చోటు చేసుకున్న వివాదాలే. ఒక అవార్డు ఫంక్షన్‌లో నయనతార .. అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించడానికి ఇష్టపడక,  విఘ్నేశ్ శివన్ చేతుల మీదుగా తీసుకోవడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ సంఘటన తర్వాత వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న మాటలు ఇండస్ట్రీలో బాగా ప్రచారం అయ్యాయి.అంతేకాదు, గతంలో కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ తన సినిమాల్లో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవడం ఇష్టపడటం లేదని కూడా వార్తలు వినిపించాయి. అలాంటి నేపథ్యంలో, ఇప్పుడు అదే నయనతారను బన్నీ సినిమాలో నటింపజేయాలని లోకేష్ కనగరాజ్ ప్రయత్నిస్తున్నాడన్న టాక్ పెద్ద సంచలనంగా మారింది.

ఇది నిజంగా జరిగితే, ఇది ఇండస్ట్రీలో అరుదైన పరిణామమే అవుతుంది. ఇద్దరి మధ్య ఉన్న పాత విభేదాలను పక్కన పెట్టి, ఒకే ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయడం అంటే అది ఒక భారీ రిస్క్‌తో పాటు పెద్ద ప్రయోగం కూడా.అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ వార్తలు ఎక్కువగా కోలీవుడ్ మీడియా నుంచి మాత్రమే లీక్ అవుతున్నాయి. నిజంగా ఇది పబ్లిసిటీ స్టంట్‌నా? లేక నిజంగా లోకేష్ కనకరాజ్ ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడా? అన్నది మాత్రం త్వరలోనే తేలనుంది.
ఏది ఏమైనా, అల్లు అర్జున్నయనతారలోకేష్ కనగరాజ్ కాంబినేషన్ నిజమైతే మాత్రం ఇండియన్ సినిమాను షేక్ చేసే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: