ప్రేక్షకులందరికీ ఎన్నో రోజులుగా అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ముగిసింది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలిచాడు. ఇక ఎంతోమంది మహా మహా సెలెబ్రెటీలు హౌస్ లో ఉన్నప్పటికీ ఇక అటు బుల్లితెర ప్రేక్షకులందరూ కూడా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ కి బ్రహ్మరథం పట్టారు అని చెప్పాలి. దీంతో ఇక ఓటింగ్ లో కూడా వారు వన్ సైడ్ అన్నట్లుగానే సాగింది.


 అమర్దీప్ టైటిల్ విన్నింగ్ రేసులో పల్లవి ప్రశాంత్ కు కాస్త పోటీ ఇచ్చిన ఇక రైతు బిడ్డకు వచ్చిన ఓటింగ్ ముందు అమర్దీప్  కూడా నిలవలేకపోయాడు అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అంటూ నాగార్జున ఎంతో గ్రాండ్ గాని ప్రకటించాడు. అయితే ఇటీవల ఆదివారం జరిగిన ఎపిసోడ్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే తన ఆట తీరుతో ప్రేక్షకులకు హృదయాలను గెలుచుకొని ఇక ఫినాలే వరకు చేరుకున్న వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్ లో ఎంత పారితోషకం తీసుకుంది అన్నది కూడా వైరల్ గా మారిపోయింది. అయితే అప్పటికే సీరియల్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియాంక వారానికి 2 5 లక్షల పారితోషకం అందుకుందట. ఈ లెక్కన 15 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను 37.5 లక్షల రూపాయలు వెనకేసుకుందుట ప్రియాంక. అయితే ఇందులో టాక్స్ లు పోను మిగతావి ప్రియాంక చేతికి వస్తాయి అని చెప్పాలి. కాగా ఆర్థిక కష్టాల్లో ఉన్నా అని ప్రియాంక చెప్పింది. దీంతో ఈ పారితోషకంతో ఆమె కష్టాలు తీరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: