తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను సైతం ఉగాది పండుగ (మార్చి 19) హైదరాబాదులో హైటెక్ సిటీలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈవెంట్లో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలాగే ఈ అవార్డులో కాంతారావు అవార్డు అందుకున్న నటుడు డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తికి ఈ అవార్డుని ప్రకటించారు.


ఈ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ.. గడిచిన 13 ఏళ్లుగా నంది అవార్డులు ఎప్పుడు ఇస్తారని తాము ఎదురు చూస్తున్నామని కానీ ఇన్నేళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. తెలంగాణ నుంచి వచ్చిన నటులలో కాంతారావు ముందు వరుసలో ఉంటారు. అప్పట్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ కు పోటీగా హీరోగా ఉన్నారు కాంతారావు ఎన్నో చిత్రాలలో నటించారు. తెలంగాణ బిడ్డే తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. అలాంటి ఆయన అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.


అలాగే అదే సమయంలోనే సీఎం చంద్రబాబు గారికి మీకు దండం పెట్టి అడుగుతున్నాను సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డులు ఇవ్వండి తెలుగు సినిమా పరిశ్రమను గుర్తించి గౌరవించండి సినీ పరిశ్రమను ఎంకరేజ్ చేయండి అంటూ తెలియజేశారు. మరి ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. గద్దర్ అవార్డు వేడుకలలో కూడా మెగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వం ఇండస్ట్రీకి చేస్తున్న అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: