ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రం డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. కాగా రిలీజ్ దగ్గర పడుతున్నా సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు మూవీ టీం. అయినా కూడా సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేసి సింపుల్ గా రాజమౌళితో ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారు. అలాగే రీసెంట్ గా సలార్ మూవీ ఫస్ట్ టికెట్ ని రాజమౌళి అందుకున్న విషయం తెలిసిందే. 

ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ నెలలో జరుగుతున్నాయి. శుక్రవారం కర్ణాటకలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ కి ఐదు రోజులే ఉండగా ఇప్పటివరకు బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వకపోవడం గమనార్హం. సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ డే టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లోని శ్రీరాములు

థియేటర్లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటిగంటకు సలార్ షో పడుతుందని, ఈ షోకి 100 మంది ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ కి ఉచితంగా టికెట్స్ ఇస్తానని, వాళ్ళతో కలిసి సినిమా చూస్తానని నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు." పదేళ్ల క్రితం ఇదే థియేటర్లో మిర్చి సినిమా రాత్రి 1 చూసాను. ఇప్పుడు సలార్ సినిమాతో హిస్టరీ మళ్లీ రిపీట్ అవుతుంది" అంటూ  తెలిపాడు నిఖిల్. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే సలార్ 100 టికెట్లను ప్రభాస్ డైలాగ్స్ కి ఫ్రీగా ఇస్తానన్న నిఖిల్ ఆ టికెట్స్ ఎలా తీసుకోవాలనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా నిఖిల్ లాంటి యంగ్ హీరో ప్రభాస్ పై ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకోవడం విశేషమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: