మళయాళ దర్శకుడు జీతూ జోసఫ్ పేరు వినగానే ఎవరికైనా వెంటనే అతడు దర్శకత్వం వహించిన మళయాళ మూవీ ‘దృశ్యం’ గుర్తుకు వస్తుంది. ఈసినిమా కేవలం మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఈసినిమాను దక్షిణాది సినిమా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడంతో ఈమూవీని తెలుగు తమిళ మళయాళ భాషలలొ డబ్ చేసి విడుదల చేశారు.


అక్కడ కూడ ఈమూవీ ఘనవిజయం సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్ కూడ తీశారు. దీనితో దర్శకుడు జీతూ జోసఫ్ పేరు దక్షిణాది సినిమా రంగంలో మారుమ్రోగిపోయింది. ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ జీతూ జోసఫ్ తనకు ‘దృశ్యం 3’ తీసీ ఆలోచన ఉంది అంటూ తన ఊహను బయట పెట్టాడు.


ఈ ఆలోచన ఇంకా రూపు దిద్దు కోకుండానే ఈ మళయాళ దర్శకుడు లేటెస్ట్ గా మళయాళ టాప్ స్టార్ మోహన్ లాల్ తో తీసిన లేటెస్ట్ మూవీ ‘నేరు’ మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని సాధించింది. ఈమూవీతో పోటీగా ప్రభాస్ నటించిన ‘సలార్’ విడుదల అయినప్పటికీ ఆ పోటీని తట్టుకుని ఈ సినిమా ఘన విజయం సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టి ఈ మూవీ రైట్స్ పై పడింది.


ఒక మంత్రి కొడుకు ఒక మధ్యతరగతికి చెందిన ఒక అమ్మాయిని కారు తో ఢీ కొట్టడమే కాకుండా ఆమంత్రి కొడుకు యాక్సిడెంట్ స్పార్ట్ నుండి పారిపోవడంతో ఈ మూవీ అసలు కథ ప్రారంభం అవుతుంది. కేరళ రాష్ట్రంలో యాదార్థంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా జీతూ జోసఫ్ ఈమూవీని తీశాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈమూవీకి సంబంధించిన తెలుగు రీమేక్ లో లాయర్ పాత్రలో లాయర్ పాత్రలో వెంకటేష్ తో నటింప చేయాలా లేదంటే పవన్ కళ్యాణ్ తో ఈమూవీ కథను చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో ఈ మూవీని తెలుగులో తీయాలని ప్రయత్నిస్తున్నట్లు దిల్ రాజ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: