సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ఇద్దరి పేర్లు ఎప్పుడు వినిపించినా కూడా తెలియకుండానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇద్దరు జంట అటు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అంతలా కనెక్ట్ అయ్యింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి. ఈ ఇద్దరు ఎప్పుడు బయట కనిపించినా కూడా మీ పెళ్లెప్పుడు అనే ప్రశ్న వీరికి ఎప్పుడూ ఎదురవుతూ ఉంటుంది అని చెప్పాలి.


 అయితే తమ మధ్య ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ తప్ప ఆఫ్ స్క్రీన్ లో మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ స్టేజ్ మీద వీరిద్దరూ లవ్ ట్రాక్ నడిపించిన తీరు చూసి మీరు నిజంగానే లవర్స్ అని బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండగా.. ఇంకోవైపు రష్మీ అటు యాంకర్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి  అయితే ఇక ఈ ఏడాది రష్మి పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవలే ఈటీవీలో రష్మీ పెళ్లి పార్టీ అని ఒక ఈవెంట్ నిర్వహించారు.



 ఈ ఈవెంట్లో ఏకంగా రశ్మి తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అయితే అతను మన దేశానికి చెందినవాడు కాదు విదేశీయుడు అని తెలుస్తుంది  ఇక ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భారత ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో ఇమాజినేషన్స్ ఉంటాయి   ఇక నా ఇమేజినేషన్లో ఉన్న వ్యక్తి ఇతనే అని రష్మీ చెప్పుకొచ్చింది. వీరి జంట కూడా చూడముచ్చటగా ఉంది అని చెప్పాలి. ఇది చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇది కేవలం ఈవెంట్ కోసమేనా.. లేకపోతే నిజంగానే రష్మీ పెళ్లి చేసుకుంటుందో అర్థం కాక కన్ఫ్యూజన్లో పడిపోయారు అని చెప్పాలి. ఇంకొంతమంది రష్మీ పెళ్లి చేసుకుంటే మరి సుడిగాలి సుదీర్ పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: