మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో మోహన్ లాల్ ఒకరు. ఇప్పటి వరకు ఎన్నో మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మలయాళ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా మోహన్ లాక్ కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన కేవలం మలయాళ సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మోహన్ లాల్ కు తెలుగు లో కూడా అదిరిపోయే రేంజ్ గుర్తింపు ఉంది.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన నీరు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ డిసెంబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ 80 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని జనవరి 23 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు మలయాళ , తెలుగు , హిందీ , తమిళ , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: