‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ పై రోజురోజుకి అంచనాలు పెరిగి పోతున్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీయబడుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ కు వచ్చిన స్పందనతో అంచనాలు మరీ పెరిగిపోయాయి. ఏప్రియల్ మొదటి వారంలో తెలుగు వారి ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ సోలో మూవీగా విడుదల కాబోతున్న ఈ మూవీకి ఎలాంటి పోటీ లేకపోవడంతో ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది.మూవీ విడుదల అయ్యే ఏప్రియల్ నెల దగ్గరకు రావడంతో ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ఊపందుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఏరియా రైట్స్ కు సంబంధించి నిర్మాతలు చెపుతున్న రేట్లు విని బయ్యర్లు హడలిపోతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ నైజాం రైట్స్ ను 50 కోట్లకు తక్కువ ఇచ్చే ప్రశక్తి లేదని ఈ మూవీ నిర్మాతలు చెపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.జూనియర్ నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి వచ్చిన కలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈమూవీ నిర్మాతలు ఈ రేట్లను కోట్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ తో పాటు చరణ్ కూడ నటించడమే కాకుండా రాజమౌళి ఇమేజ్ ఆమూవీని రక్షించిందని అలాంటి రేంజ్ ‘దేవర’ కు ఎంత మాత్రం ఉంటుంది అంటూ కొందరు బయ్యర్లు తమలో తాము మధన పడుతున్నట్లు టాక్. దీనితో  ఈ  సినిమా  విషయం లో  ఈ మూవీ నిర్మాతల  మార్కెటింగ్  అంచనాలు  ఎంత వరకు  విజయ వంతం  అవుతాయి  అన్న  విషయ మై  భిన్న అభిప్రాయాలు ఇండస్ట్రి  మార్కెటింగ్  వర్గాలలో  వినిపిస్తున్నాయి . దీనితో  ఈ మూవీ  మార్కెట్ ఎలా నడుస్తుంది  అన్న  ఆశక్తి ఇండస్ట్రి వర్గాలలో   ఉంది 


మరింత సమాచారం తెలుసుకోండి: