చూడ చక్కని హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన క్యూట్ క్యూట్ హావభావాలతో అందాలతో ఇంకా సహజమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులని ఎంత గానో ఆకట్టుకుంది. తన గ్లామర్ మరీ అంతగా హద్దులు మీరకుండా సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య మరింత వైరల్ అయింది. ఆమె మెగా కోడలు కావడంతో లావణ్య పోస్టులు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే లావణ్య అయోధ్యలో జన్మించిందని కేవలం చాలా తక్కువ మందికి తెలుసు. నిన్న దేశవ్యాప్తంగా 500 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో దేశమంతా కూడా పండగ వాతావరణం నెలకొంది.దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానాలు చేశారు. ఎంతో ఘనంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. ఇక పలువురు సెలబ్రిటీలు ఆలయాలకు వెళ్లారు.


లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. లావణ్య త్రిపాటి అయోధ్యలో పుట్టడంతో ఆమెకు రామయ్య ఆలయంతో మరింత అటాచ్మెంట్ ఉంది.చీరలో ఎంతో పధ్ధతిగా సీతారాముల పట్టాభిషేకం విగ్రహం ఉన్న భారీ హారం మెడలో ధరించి ఆమె ఫోటోలను షేర్ చేస్తూ.. రాముని పుట్టిల్లు అయిన అయోధ్యలో నేను పుట్టడం, ఈ అద్భుతమైం కార్యక్రమాన్ని చూడటం నా అదృష్టం. రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడటం నాతో పాటు దేశప్రజలందరికి గర్వకారణం. ఈ సందర్భంగా రామ పరివారాన్ని నగలుగా ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక అయోధ్యకు మాత్రమే కాదు దేశం మొత్తానికి కూడా సంబంధించింది.మన దేశం మొత్తం కలిసి వచ్చే సమయం ఇది.ఇది దేశంలోని ప్రజలందరి మధ్య ఐక్యత భావాన్ని నెలకొల్పుతుంది. పెదవులపై జై శ్రీరామ్ అంటూ, గుండెల్లో దైవభక్తిని నింపుకొని  దేశమంతా శాంతి ఉండాలని ప్రార్ధిద్దాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో లావణ్య పోస్ట్ వైరల్ అవ్వగా లావణ్య అయోధ్యలో పుట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అదృష్టవంతురాలు అని ఇంకా మెగా ఫ్యామిలీ చాలా లక్కీ అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: