నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం మొదటగా దసరా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా దసరా మూవీ విజయంతో ఫుల్ జోష్ లో నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని కూడా పోయిన సంవత్సరం నాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విషయాన్ని అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం నాని నటించిన రెండు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈ నటుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఇకపోతే ప్రస్తుతం నాని ... వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ.కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ఇప్పటికే అమ్మి వేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారికి 45 కోట్ల భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అలాగే నాని కెరియర్ లోనే హైయెస్ట్ ధరకు ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులు అమ్ముడు పోయినట్లు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: