లేటెస్ట్ గా విడుదలైన ఫైటర్ మూవీ కలెక్షన్ బాగానే ఉన్నప్పటికీ  బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ స్థాయిలో  లేవు  అన్నవార్తలు  వస్తున్నాయి. ఈ మూవీని చూసిన సగటు ప్రేక్షకుడు ‘పఠాన్’ స్థాయిలో ఈ మూవీ లేదు అని అంటున్నారు. ముఖ్యంగా బిసి సెంటర్స్ ప్రేక్షకుల ఆదరణ పొందడంలో ‘ఫైటర్’ విఫలం అయింది అన్నవార్తలు  వస్తున్నాయి. భారీ గ్రాఫిక్స్ సహాయంతో ఈమూవీలో చూపెట్టిన ఆకాశంలోనే జరిగే యుద్ధాన్ని సగటు ప్రేక్షకుడు పూర్తిగా ఆస్వాదహించ లేకపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి.  మూవీ తరువాత హృతిక్ రోషన్ కొంత గ్యాప్ తీసుకుని ‘వార్ 2’ ను  మొదలుపెట్ట బోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి హృతిక్ చేయబోతున్న మాల్టీ స్టారర్ కాబట్టి ఈ మూవీ పై తెలుగు  ప్రేక్షకులలో  భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ‘వార్ 2’ విడుదలకావడానికి  ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్  వర్క్ ప్రస్తుతం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.తెలుస్తున్న సమాచారం మేరకు ‘వార్ 2’ కథ యుద్ధ విమానాల నేపథ్యంలో ఉండదు. అంతేకాదు టెర్రరిజమ్ ని ఎదుర్కునే హీరోయిజమ్ కూడ ‘వార్ 2’ కథలో ఉండదు. అయితే ఈసినిమాను నిర్మిస్తున్న యష్ రాజ్ అధినేత సినిమా స్క్రిప్ట్ ను జడ్జ్ చేయడంలో చాల సిద్ధహస్థుడు. అందువల్లనే ఎన్నో విజయవంతమైన సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. అందువల్ల ‘వార్ 2’ కథ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు అని అంటున్నారు.ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘దేవర’ మూవీ విడుదల అయ్యాక ‘వార్ 2’ షూటింగ్ మొదలుపెట్టె ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈసినిమాలో తారక్ నటించబోయేది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర కావడంతో ఆ పాత్ర కోసం జూనియర్ తన లుక్ మార్చుకోవాడమే కాకుండా హిందీ భాషలో పట్టు సంపాదించచడానికి తన ఇంటికి ఒక హిందీ ట్యూటర్ ను కూడ రప్పించుకుంటున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: