బాలీవుడ్ వివాదాల నటి పూనమ్ పాండే కన్నుమూశారని వార్త రావడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బాలీవుడ్ లో పలు సినిమాలతో మెప్పించిన పూనమ్ పాండే సడన్ గా మరణించారని న్యూస్ వైరల్ అవుతుంది.ఈ వార్త ఇప్పుడు చక్కర్లు కొట్టడంతో ఆమె అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటి దాకా బాలీవుడ్ లో జరిగిన పలు ఈవెంట్స్ లో నవ్వుతూ కనిపించింది పూనమ్ పాండే. కానీ ఇంతలోనే ఆమె క్యాన్సర్ కారణంగా మరణించిందని సమాచారం తెలుస్తోంది. ఫిబ్రవరి 1న పూనమ్ గర్భాశయ క్యాన్సర్ తో కన్నుమూసిందని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో తన మేనేజర్స్ తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా షేర్ చేశారు.పూనమ్ పాండే ఫిబ్రవరి 1 రాత్రి మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ పూనమ్ పాండే మరణించిందని ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు.


పూనమ్ పాండే కాన్పూర్ లోని తన నివాసంలో కన్నుమూసింది. పూనమ్ పాండే చివరిగా కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ షో లాక్ అప్‌లో కనిపించింది. ఈ షోలో పూనమ్ అందరికి బాగా నచ్చేసింది. ఆమె పడ్డ కష్టం విని చాలా మందికి జాలేసింది.2013లో నషా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూనమ్ పాండే.ఈ మూవీలో బోల్డ్ గా నటించి మెప్పించింది. ఇక తెలుగులో మాలిని అండ్ కో అనే మూవీలో నటించింది పూనమ్ పాండే. 2015లో వచ్చిన ఈ సినిమాలో నటుడు సామ్రాట్ హీరోగా నటించాడు. ఈ సినిమా రొమాంటి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆశించిన స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ పూనమ్ గ్లామర్ కు అయితే మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తిరిగి ఆమె బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా ఎక్కువ సినిమాల్లో నటించలేదు పూనమ్. పూనమ్ తన భర్తతో గొడవలతో ఇంకా ఇంటర్నెట్ లో తన అస్లీల వీడియోలతో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ ఉండేది.ఇక ఇప్పుడు పూనమ్ పాండే మరణ వార్త తెలిసి బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: