దీనికి "మైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక ఎపిసోడ్ లో పాలు పంచుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం" అంటూ షేర్ చేసింది. ఇందులో పూనమ్ "రెండేళ్లు ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ వ్యాధి వల్ల కనీసం దుస్తులు కూడా వేసుకోలేని స్థితికి వెళ్లాను. దానికి చికిత్స తీసుకున్న తర్వాత కూడా తీవ్రమైన నొప్పులు. బట్టలు వేసుకుంటున్నప్పుడు కూడా తీవ్రమైన నొప్పి. బాడీలో మూమెంట్స్ కూడా ఉండేవి కాదు. లూజ్ బట్టలు వేసుకోవాలి. అలా రెండేళ్లు ఈ వ్యాధి వల్ల నరకం చూశాను" అంటూ చెప్పుకొచ్చింది. అయితే పూర్తి వీడియో త్వరలోనే బయటకు రానుంది.ఈ వ్యాధి బారిన వ్యక్తులు నిద్రలేమితో బాధపడుతుంటారు. శరీరంలో ఇమ్యునిటీ లోపం వస్తుంది. దానివల్ల అలసిపోవడం, శరీరం మొత్తం విపరీతమైన నొప్పి కలిగి ఉంటుంది. ముఖ్యంగా మెడ, భుజాలు, ఛాతీ, వీపు వద్ద నొప్పి ఉంటుంది. అందువల్ల కనీసం కదలడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. వారి శరీరమే వారికి బరువైపోతుందట. అంతేకాదు జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. దానితో పాటు ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఫైబ్రోమైయాల్జియాకు పూర్తి స్థాయిలో చికిత్స లేదని, దానికి సరిపోయే మందులు కూడా లేవని వైద్యులు అంటున్నారు. కానీ జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, యోగా, మెడిటేషన్ వంటి పద్దతుల వల్ల వ్యాధిని కంట్రోల్ చేయవచ్చని నిఫుణులు సూచిస్తున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి