చిన్నసినిమాగా విడుదలై అందర్నీ మెప్పించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. చిన్న సినిమాల హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా నటించిన ఈమూవీ అతడి కెరియర్ కు మరో టర్నింగ్ పాయింట్ అవ్వబోతోంది. ఈసినిమా విడుదలకు ముందు ఈమూవీ కంటెంట్ పై ఉన్న ధైర్యంతో తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రధాన నగరాలలో వేసిన పెయిడ్ ప్రిమియర్స్ ఈమూవీ పై పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.ఈసినిమాలోని నటీనటుల పాత్రలు చాల సహజంగా ఉండటంతో ప్రేక్షకులు చాల సులువుగా కనెక్ట్ అవుతున్నారు. ఈసినిమా చూసిన వారు అంతా ఈమూవీలో హీరో అక్క పాత్రలో నటించిన శరణ్య ప్రదీప్ గురించి మాట్లాడుకుంటున్నారు. ‘ఫిదా’ మూవీలో సాయి పల్లవి అక్కగా నటించిన ఈమెకు ఆతరువాత అవకాశాలు వచ్చినప్పటికీ ఆసినిమాలు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి.అయితే ఇప్పుడు ఆలోటును ఈమూవీ తీర్చబోతోంది. ఈమూవీలో ఆమె చేసిన పద్మ పాత్ర చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుంది. ఈమూవీ సెకండ్ ఆఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్స్ లో ఆమె నటించిన నటనకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఈమె నటనను చూసిన వారు ఈమెలో ఇంత మంచి నటన ఉందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్య పోతున్నాయి.రానున్న రోజులలో ఈసినిమా వల్ల ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారామ్ ఉంది అని అంటున్నారు. హీరో పాత్రలో నటించిన సుహాస్ కంటే ఎక్కువమంది శరణ్య గురించి మాట్లాడుకుంటూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఏడి ఎలా ఉన్నా ఇండస్ట్రీకి మరో మంచి నటిని గుర్తించడం జరిగింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ సూపర్ సక్సస్ కు కొనసాగింపుగా ఈచిన్న సినిమా కూడ విజయవంతం కావడంతో ప్రేక్షకులు సినిమా హీరోల ఇమేజ్ కంటే కథ కధనం గురించి ఎక్కువ పట్టించుకుంటున్నారు అన్న విషయం మరొకసారి రుజువైంది..    మరింత సమాచారం తెలుసుకోండి: