టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయన చాలా సినిమాలలో నటించగా అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు "గామి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ లో ప్రకటించారు. ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ అప్డేట్ ను ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఇకపోతే గామి మూవీ యూనిట్ ఎలాంటి అప్డేట్ ను ఇవ్వబోతుంది అనేది తెలియాలి అంటే ఫిబ్రవరి 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే గామీ మూవీ లో విక్వక్ అదిరిపోయే రేంజ్ లో డిఫరెంట్ లుక్ లో ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే విశ్వక్ ఈ మూవీ తో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇలా ప్రస్తుతం విశ్వక్ రెండు మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాల నుండి చిత్ర బృందాలు విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడంతో ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకుంటాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: