కొత్త కొత్త కాన్సెప్టులతో కొత్త చిత్రీకరణ పోకడలతో వచ్చే చిత్రాలు ఇప్పుడు బాగా అలరిస్తున్నాయి. తాజాగా.. ఐ హేట్ లవ్‌.. ఈ టైటిల్ వింతగా ఉంది కదా. సుబ్బు, శ్రీవల్లి, కిట్టయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా టైటిల్ ఇది. దీనికి నేనూ ప్రేమలో పడ్డాను అనేది సబ్ టైటిల్. ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లో విడుదలవుతోంది. గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీర శంకర్సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.


ట్రైలర్ చాలా బాగుందన్న వీర శంకర్‌.. సహజత్వంగా బాగా చిత్రీకరించారని అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుందని  ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. మంచి సినిమా తీస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులను దర్శకుడు వీర శంకర్‌ అభినందించారు.


నిర్మాత  డాక్టర్ బాల రావి గారు  (USA)   మాట్లాడుతూ కథ పరంగా  ఎక్కడ రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించాము. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా అంత ప్రశాంతంగా ఆస్వాదించవచ్చన్నారు.


కో- ప్రొడ్యూసర్ పాలగుమ్మి వెంకట కృష్ణ  మాట్లాడుతూ మంచి చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రం తీసామన్నారు. గోదావరి జిల్లా యాసతో  పూర్తిగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో  షూటింగ్ చేయడం జరిగిందని దర్శకుడు వెంకటేష్.వి తెలిపారు. ఇది యూత్ ని బాగా ఆకట్టుకునే సందేశాత్మక కథ.  పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పాటలకి మంచి స్పందన వచ్చిందని.. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని దర్శకుడు వెంకటేష్.వి అన్నారు.


అంగర శివ సాయి గౌడ ఈ సినిమాకి  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏస్ కె యల్ ఎమ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కాబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: