నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి. అలాగే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత..?  ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన లాభాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 12.80 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.68 కోట్లు , యు ఏ లో 2.58 కోట్లు , ఈస్ట్ లో 1.40 కోట్లు ,  వేస్టు లో 87 లక్షలు , గుంటూరు లో 1.37 కోట్లు ,  కృష్ణ లో 1.35 కోట్లు , నెల్లూరు లో 65 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 23.70 కోట్ల షేర్ ... 43.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 5.60 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 9.30 కోట్ల కలెక్షన్ దక్కాయి. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 38.60 కోట్ల షేర్ ... 84.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 27.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మొత్తం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 10.10 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: