తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క ఇమేజ్ చాల డిఫరెంట్. మొదట్లో గ్లామర్ పాత్రలను చేసిన అనుష్క ఇమేజ్ ‘అరుంధతి’ మూవీ తరువాత పూర్తిగా మారిపోయింది. ఆతరువాత ఆమె నటించిన ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ఆమెను పాన్ హీరోయిన్ స్థాయికి తీసుకు వెళ్ళినప్పటికీ ‘సైజ్ జీరో’ మూవీ కోసం ఆమె చేసిన సాహసం ఆమెకు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టడంతో ఆమె కెరియర్ బాగా స్లోగా నడుస్తోంది.కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన ‘భాగమతి’ మూవీతో మళ్ళీ ఆమె ట్రాక్ లోకి వస్తుంది అని ఆమె అభిమానులు భావించినప్పటికీ అది జరగలేదు. ఆతరువాత చాల గ్యాప్ తీసుకుని ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ సక్సస్ అయినప్పటికీ ఆ క్రెడిట్ నవీన్ పోలిశెట్టి ఖాతాలోకి వెళ్ళిపోయింది.ఇలాంటి పరిస్థితుల మధ్య క్రిష్ దర్శకత్వంలో ఆమె ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను చేస్తున్న విషయం చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా పేరుగాంచిన యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈమూవీ షూటింగ్ ఇప్పటికే చాలవరకు పూర్తి అయింది అంటున్నారు. ఈమూవీని సమ్మర్ రేస్ లోకి తీసుకు రావాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.తమిళ హీరో విక్రమ్ ప్రభు ఈమూవీలో అనుష్క పక్కన నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుని ఒకేసారి దేశవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళ కన్నడ భాషలలొ విడుదల కాబోతున్న ఈమూవీకి ‘శీలావతి’ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు లీకులు వస్తున్నాయి. ఈ టైటిల్ లో అనేక అర్థాలతో పాటు ‘గుణవతి’ అన్న అర్థం కూడ ఉంది. అన్ని భాషల ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఈ టైటిల్ ను క్రిష్ వ్యూహాత్మకంగా ఫిక్స్ చేశాడు అనుకోవాలి. క్రిష్ ఎన్నో భారీ అంచనాలతో మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ మధ్యలో ఆగిపోవడంతో క్రిష్ ఇప్పుడు తన దృష్టి అంతా ఈమూవీ పై పెట్టాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: