ఒకే సంవత్సరంలో ఒక టాప్ హీరో నటించిన రెండు సినిమాలు వేరువేరుగా 1000 కోట్లు కలక్షన్స్ వసూలు చేయడం అంత సులువైన పనికాదు. కానీ ‘పఠాన్’ ‘జవాన్’ సినిమాలతో షారూఖ్ ఖాన్ ఆరికార్డును క్రియేట్ చేసి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి తన రేంజ్ ఏమిటో చూపించాడు. అయితే ఆ ఫీట్ ను మళ్ళీ రిపీట్ చేద్దామని ‘ఢంకీ’ మూవీతో ప్రయత్నించినా షారూఖ్ ఆశించిన హ్యాట్రిక్ దక్కలేదు.



షారూఖ్ లేటెస్ట్ గా నటించిన ‘ఢంకీ’ మూవీకి డివైడ్ టాక్ రావడంతో ఆమూవీ కలక్షన్స్ 400 కోట్లు దాటలేక పోయింది. ‘సలార్’ మూవీతో పోటీగా విడుదలైన ఈ మూవీ ‘సలార్’ ముందు నిలబడలేక పోయింది. ఇప్పుడు ఈమూవీని నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 15 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే ఇదే సినిమాతో నెట్ ఫ్లిక్స్ లో పోటీగా విడుదలైన ‘సలార్’ ‘గుంటూరు కారం’ మూవీల ముందు వెనకపడటమే కాకుండా ఈ మూవీ ప్రమోషన్ విషయంలో నెట్ ఫ్లిక్స్ అనుసరించిన వ్యూహం షారూఖ్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ఏదైనా స్టార్ హీరో మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రమోషన్ ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వారం పదిరోజుల ముందే సోషల్ మీడియాలో  విపరీతమైన హడావిడి జరుగుతుంది. ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడమే  కాకుండా స్పెషల్ గా ట్రైలర్లు కట్  చేస్తారు.  



‘గుంటూరు కారం’ కోసం హైదరాబాద్ లో ఒక ఐదు అంతస్థుల బిల్డింగ్ సైడ్ వాల్ మీద మహేష్ బాబు భారీ పెయింటింగ్ వేయించడం బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రభాస్ మూవీ ‘సలార్’  విషయమై  నెట్ ఫ్లిక్స్ యాడ్స్ తో హోరెత్తించింది. అయితే  ఇలాంటి ప్రచారం ఏదీ ‘ఢంకీ’ కి చేయకపోవడం షారూఖ్ అభిమానులను షాక్ కి గురిచేసి తమ టాప్ హీరోకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ షారూఖ్ అభిమానులు అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది..  





మరింత సమాచారం తెలుసుకోండి: