గతనెల సంక్రాంతి రేస్ కు విడుదలై ఎవరు ఊహించని ఎవరు ఊహించని ఘన విజయం అందుకున్న ‘హనుమాన్’ రిలీజ్ అయి 6 వారాలు అవుతున్నప్పటికీ ఈ మూవీ కలక్షన్స్ మ్యానియా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మూవీ ఘన విజయంతో జోష్ లోకి వెళ్ళిపోయిన ప్రశాంత్ వర్మ ఈమూవీకి సంబంధించిన సీక్వెల్ ‘జై హనుమాన్’ పై దృష్టి పెట్టాడు.



ఈసినిమా మార్చి మొదటి వారంలో అమెజాన్ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది అని అంటున్నారు. ఈమూవీ కలక్షన్స్ నెమ్మదినెమ్మదిగా తగ్గిపోతున్న పరిస్థితులలో ఈమూవీ టిక్కెట్ రేట్ ను భారీగా తగ్గించి ఈమూవీని ఇప్పటివరకు చూడని ప్రేక్షకులను ధియేటర్ల వైపు రప్పించాలని ఈమూవీ నిర్మాతల మాష్టర్ ప్లాన్ అని అంటున్నారు.



దీనితో ఈ టిక్కెట్ రేట్ల భారీ తగ్గుదల ఎంతవరకు ‘హనుమాన్’ కలక్షన్స్ ను పడిపోకుండా రక్షించగలదు అన్న విషయంతో ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశ ప్రజలలో శ్రీరాముడి మ్యానియా విపరీతంగా కొనసాగుతున్న నేపధ్యంలో ఉత్తర భారత దేశంలో ఈ టిక్కెట్ల తగ్గుదల ‘హనుమాన్’ కలక్షన్స్ ను నిలబెట్టడానికి ఎంతోవకొంత సహకరించ వచ్చు అన్న అభిప్రాయాలు కూడ కొందరికి కలుగుతున్నాయి.



అయితే ఈ టిక్కెట్ రేట్ తగ్గింపు వెనుక మరొక వ్యూహం కూడ ఉంది అంటున్నారు. ఈసినిమాకు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ ‘జైహనుమాన్’ మొదలుపెట్టబోతున్న పరిస్థితులలో ఆసినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడాలి అంటే ప్రస్తుతం రన్నింగ్ లో ‘హనుమాన్’ మూవీని ఎన్ని రోజులు కొనసాగించగలిగితే అంత మేలు అన్న అభిప్రాయం కూడ ప్రశాంత్ వర్మకు ఉంది అంటున్నారు. అయితే హనుమంతుడి పాత్ర కోసం ప్రశాంత్ వర్మ కొనసాగిస్తున్న అన్వేషణ ఇప్పటికీ పూర్తి అవ్వకపోవడంతో పాటు ఈమూవీ సీక్వెల్స్ స్క్రిప్ట్ విషయంలో కూడ ఇంకా మార్పులు చేర్పులు కొనసాగుతున్న పరిస్థితులలో ఈ ‘జై  హనుమాన్’ సీక్వెల్ మొదలుకావడానికి మరికొంత కాలం పట్టినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ కూడ కొందరు చేస్తున్నట్లు తెలుస్తోంది..    
















మరింత సమాచారం తెలుసుకోండి: