మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మమ్ముట్టి తాజాగా భ్రమయుగం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రిత మే మలయాళ భాషలో భారీ అంచనాలతో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకులు నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇలా ఇప్పటికే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే తెలుగు భాషలో విడుదల చేయబోతున్నారు. 

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. ఇక ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగులో ఫిబ్రవరి 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు  ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీ ని సితార సంస్థ వాళ్ళు తెలుగు లో విడుదల చేస్తూ ఉండడంతో కూడా ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: