ఓ ప్రక్కన ఓటిటి మార్కెట్ పడిపోయింది అంటూంటే మరో ప్రక్క క్రేజ్ ఉన్న ఫిల్మ్స్ కు ఓటిటి డీల్స్ భారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెద్ద బ్యానర్, క్రేజీ కాంబినేషన్ అయితే ఓటిటీ సంస్దలు పోటీ పడుతున్నాయి.మిగతా సినిమాలను పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో తాజాగా 'టిల్లు స్వ్కేర్‌' కు ఓటిటి డీల్ ఫినిష్ అయ్యిందని వినికిడి. నెట్ ప్లిక్స్ వారు ఈ చిత్రం ఓటిటి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మార్చి 29న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.రిలీజ్‌కు దాదాపు నెలన్నర ముందే డీజే టిల్లు స్వ్కేర్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'టిల్లు స్వ్కేర్‌' సినిమా ఓటిటి డీల్ కోసం అమేజాన్, నెట్ ప్లిక్స్ , సోనీ లివ్ పోటీ పడ్డాయని, చివరకు భారీ మొత్తం ఇచ్చి నెట్ ప్లిక్స్ వారు ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఫిల్మ్ డిజిటల్ హక్కులను దాదాపు 35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగులు చేసినట్లు చెబుతున్నారు. అయితే అఫీషియల్ సమాచారం అయితే కాదు. మీడియా వర్గాల్లో వినపడుతున్నమాటే. నిజంగా 35 కోట్లుకు అమ్ముడైతే జాక్ పాట్ కొట్టినట్లే. అయితే మీడియం రేంజ్ సినిమాకు అంత రేటు పెడతారా అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా మారింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన 'డీజే టిల్లు' ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఎక్సపెక్టేషన్స్ కు మించి సక్సెస్ సాధించిన ఆ చిత్రం మంచి వసూళ్లనూ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ రెడీ చేసిన విషయం తెలిసిందే. 'మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి 'టిల్లు స్వ్కేర్‌' ( వచ్చేస్తున్నాడు. మొదటి పార్ట్‌ను మించి వినోదాన్ని పంచనున్నాడు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు మాస్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనున్నాడు' అని టీమ్ చెప్తోంది. రామ్‌ మల్లిక్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఈ యంగ్‌ హీరో సరసన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్‌ పార్ట్‌లో రాధిక పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక దీనితో పాటు నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. రీసెంట్ గా దీని షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అలాగే నందినిరెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: