టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగెళ్ల నటించిన లేటెస్ట్ చిత్రం “తంత్ర “. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ అనన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఇన్ని రోజులు గ్లామరస్, కూల్ క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది."ఈ క్రతవుకు మీరు తప్పకుండా రావాలి.. మార్చి 15న థియేటర్లలో 'తంత్ర' అని అనే పోస్టర్ ని ఆమె పోస్ట్ చేసింది. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనన్యా నాగళ్ల . 'ప్లే బ్యాక్' మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.అచ్చతెలుగు అమ్మాయిలా ఎన్నో పాత్రలు చేసిన అనన్య. ఇప్పుడు 'తంత్ర' సినిమాతో సరికొత్తగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై బాగా హైప్ క్రియేట్ చేశాయి.'కాలగర్భంలో కలసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే... అందులో ఊహకందని రహస్యాలు ఎన్నో' అంటూ వచ్చిన 'తంత్ర' టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఊరిలో దుష్టశక్తి పుట్టిందని మరో గొంతు వినిపిస్తుంటే... తెరపై క్షుద్రపూజలు వంటివి కనిపించాయి. ఇక ఆ టీజర్ లో ప్రతీ సీన్ కూడా భయపెట్టేలా ఉంది. ఇక ఈ సినిమాలో అనన్యతో పాటు.. మరో హీరోయిన్ సలోని తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్ రోల్స్ చేసి మెప్పించిన సలోని 'తంత్ర'లో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు.ఈ మూవీని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి మరియు రవి చైతన్య నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: