మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ లోకా నాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి అందులో తన అద్భుతమైన నటన ప్రదర్శనతో సినీ పరిశ్రమలో నటి గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ తెలుగు లో ఏకంగా నాలుగు సినిమాల్లో నటించగా ఆ నాలుగు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

మొదట ఈ బ్యూటీ పోయిన సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం చివరలో హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి ఈ మూవీ తో కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక పోయిన సంవత్సరం చివరన సలార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం ఈ బ్యూటీ అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఆ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శృతి హాసన్ మాట్లాడుతూ ... సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిన ... వేరే ఏ పాత్ర చేసిన దాని కోసం 100% కష్టపడతాను. అలా కష్టపడి పని చేయడమే నాకు ఇష్టం. ఎందుకంటే నేను షూటింగ్ చేసిన రోజు మానసికంగా ... శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక షూటింగ్ చేసిన రోజు చివరన కనుక నాకు అలసట లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అది నాకు చాలా చెత్తగా అనిపిస్తుంది అని శృతి హాసన్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: