సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మహేష్ కెరియర్ లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీ లలో ఒక్కడు మూవీ ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ... ఆ సమయం లో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న భూమిక ఈ సినిమాలో మహేష్ కు జోడి గా నటించింది. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. ఇకపోతే ఈయన అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయం లో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ 2003 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15 వ తేదీన విడుదల అయింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా బారి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ ద్వారా మహేష్ కి భూమిక కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇలా ఆ సమయం లో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఫిబ్రవరి 23 , 24 , 25 తేదీల్లో స్పెషల్ షో స్ ప్రదర్శించనున్నట్లు ఈ చిత్ర బంధం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: