కోలీవుడ్ అందాల భామ ఇవానా లవ్ టుడే సినిమాతో అక్కడ సూపర్ హిట్ అందుకుంది. అంతకుముందు తమిళ సినిమాల్లో చిన్నా చితక వేషాలు వేసి ఇవానా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. లవ్ టుడే సినిమాతో హీరోయిన్ గా ప్రమోట్ అయిన అమ్మడు ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక అప్పటినుండి అమ్మడికి హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. లవ్ టుడే సినిమాతో తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించింది ఇవానా.

ఒక లేటెస్ట్ గా అమ్మడు దళపతి విజయ్ సినిమాకు నో చెప్పిందని టాక్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో విజయ్ హీరోగా వస్తున్న సినిమా గోట్. ఈ సినిమాలో హీరోయిన్ గా కేజిఎఫ్ భామ శ్రీ నిధి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇవానాకు ఛాన్స్ ఇచ్చిన కూడా ఆమె చేయనన్నదని టాక్. సినిమాలో అమ్మడికి విజయ్ సిస్టర్ రోల్ ఇచ్చారట మేకర్స్. విజయ్ సినిమా ఛాన్స్ అంటే ఓకే కానీ మరి సిస్టర్ రోల్ అంటే కెరీర్ కి ఇబ్బంది కలుగుతుందని ఇవానా ఆలోచించి నో చెప్పిందట.

వానా ఆలోచించింది కూడా కరెక్టే అని చెప్పొచ్చు ఎందుకంటే హీరోయిన్ గా చేస్తున్న టైంలో సిస్టర్ రోల్ చేస్తే అందరూ కూడా అలాంటి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ అలాంటి అవకాశాల్ని వద్దనుకుంటుంది. విజయ్ సినిమాలో ఛాన్స్ కాదన్నందుకు ఇవాళ మీద దళపతి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కెరీర్ లో ముందు చూపు చూసే ఇవానా ఇకమీదట సిస్టర్ రోల్స్ చేసే అవకాశం లేదని చెబుతుంది. లవ్ టుడే క్రేజ్ తో తెలుగులో ఆశిష్ రెడ్డి హీరోగా చేస్తున్న సెల్ఫిష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అమ్మడు. సెల్ఫిష్ సినిమా హిట్ అయితే తెలుగులో అమ్మడికి మరింత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: