టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాలలో సింహాద్రి మూవీ ఒకటి. 

మూవీ లో భూమిక హీరోయిన్ గా నటించగా ... ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నాజర్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. విజయేంద్ర ప్రసాద్మూవీ కి కథను అందించాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయం లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ ద్వారా మాస్ జనాల్లో ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ లభించింది.

ఇకపోతే ఆ సమయం లో భారీ విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమాను తిరిగి థియేటర్ లలో మర్టి రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన థియేటర్ లలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: