టాలీవుడ్ కమెడియన్ హర్ష చీముడు తాజాగా సుందరం మాస్టర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దివ్య శ్రీపాద కీలకమైన పాత్రలో నటించగా ... కళ్యాణ్ సంతోష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ నీ ఫిబ్రవరి 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను ఈ చిత్ర బృందం వారు విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. 

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది.  ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లని ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు కమీడియన్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హర్ష "సుందరం మాస్టర్" మూవీ తో హీరో గా ఏ స్థాయి గుర్తింపును సంపాదించుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: