మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్.. ప్రతిష్టాత్మక ల్లో ఎన్టీఆర్ మూవీ ఒకటి. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా..యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ తోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో అచ్చతెలుగు గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది జాన్వీ. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ దేవర పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

జాన్వీ మాట్లాడుతూ.. “నేను అమెరికాలోని యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాను. కానీ అక్కడ ఏమి నేర్చుకోలేదు. నా కోరిక ఒక్కటే.. ఒక సెలబ్రెటీల కూతురిగా గుర్తించని వాతావరణంలో మొదటిసారిగా ఉండడం నాకు చాలా థ్రిల్ అనిపించింది. ఎంతో రిఫ్రెష్ గా ఉండేది. అక్కడ హాలీవుడ్ ఎలా పనిచేస్తుంది. ఆడిషన్ ప్రక్రియ ఎలా ఉంటుందని.. కాస్టింగ్ ఏజెంట్లను కలవడం ఎలా ఉంటుంది అనే విషయాలను మాత్రమే తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు నేను నా ప్రజలను.. నా దేశం.. నా భాష గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా ప్రేక్షకులకు కథలను చెబుతున్నాను. హాలీవుడ్ గురించి కాదు.. నా అభిమానులతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.

ధడక్ షూటింగ్ ప్రారంభించిన తర్వాత 180 చేసాను. నా దేశానికి సంబంధించిన కథలను చెప్పాలనుకుంటున్నాను. నేను నా స్థానిక భాషతో మాట్లాడాలని తెలుసుకున్నాను. ఇక్కడి అడియన్స్ మాట్లాడినట్లుగా మాట్లాడాలి. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ తో దేవర చేస్తున్నారు. ఆయనతో ఈ మూవీ షూటింగ్ ఇంకా కొన్ని రోజులు జరుగుతుంది. కొన్ని పాటలు బ్యాలన్స్ ఉన్నాయి.” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో చాలా కాలం తర్వాత దేవర షూటింగ్ పై అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: